డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాంనాయక్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో సోమవారం ఎంపీ పర్యటించి మాట్లాడారు. ప్రస్తుతం స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత లోపించొద్దని సూచించారు. డోర్నకల్ స్టేషన్‌లో పలు రైళ్ల హాల్టింగ్‌కు సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడతానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాలోత్ నెహ్రూనాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్ చైర్‌పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌యాదవ్, పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్‌చంద్‌జైన్, కౌన్సిలర్లు బాదావత్ హేమలత, బానోత్ ప్రమీల, గారె రమేశ్, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


