రూ.12.5 లక్షలు అందజేసిన నిట్ అల్యూమ్ని
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఎస్ఎస్ స్పార్క్ (సౌజన్య అండ్ శ్రీనివాస్ వెంకట అట్లూరీ సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ అనాలసిస్ అండ్ రీసెర్చ్ సెంటర్)ను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సోమవారం ప్రారంభించారు. నిట్ వరంగల్ 1983వ బ్యాచ్ ఈసీఈ విభాగం అల్యూమ్ని విద్యార్థి శ్రీనివాస్ వి.అట్లూరీ రూ.12.5 లక్షలు కేటాయించి నిట్‌లో ఎస్ఎస్ స్పార్క్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో పనితీరు, పరీక్షలు, వర్క్‌లోడ్, అప్లికేషన్ సర్వర్, ఆప్టిమైజేషన్, డేటాబేస్ పనితీరును తెలుసుకునేందుకు, ఎక్కువశాతం మంది ఒకేసారి సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినప్పుడు తలెత్తే సమస్యల పరిష్కారానికి, పరిశోధనలనకు వేదికగా ఎస్ఎస్ స్పార్క్ రీసెర్చ్ సెంటర్ నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నిట్ డిప్యూటీ డైరెక్టర్ రతీష్‌కుమార్, అల్యూమ్ని విద్యార్థి శ్రీనివాస్ వి.అట్లూరీ, డీన్, ప్రొఫెసర్లు టి.కిషోర్‌కుమార్, శ్రీహరిరావు ఉన్నారు.


