హన్మకొండ: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషికి గుర్తింపు ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు ఫర్ డిస్కమ్స్’ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు చేపడుతున్న టీజీ ఎన్పీడీసీఎల్కు 14వ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు ఫర్ డిస్కామ్స్ లభించింది. ఈ నెల 14న న్యూ ఢిల్లీలో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన 20వ ఇండియా ఎనర్జీ సమ్మిట్ 14వ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డ్స్ ఫర్ డిస్కామ్స్ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సెక్రటరీ కె.వెంకటేశం నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్కు కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం అందించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కంపెనీ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు జాతీయ స్థాయి అవార్డు రావడం అధికారులు, ఇంజినీర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి గర్వకారణమన్నారు.
సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి


