● కొత్తపల్లి శివారులో ఘటన
వర్ధన్నపేట: బైక్పై వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి శివారులో చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కథనం ప్రకారం.. మండలంలోని వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన చెన్న సాంబరాజు(22) బైక్పై వర్ధన్నపేటకు వచ్చి పని పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఇంటికెళ్తున్న క్రమంలో కొత్తపల్లి శివారులో ఎదురుగా వస్తున్న మహీంద్ర థార్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, గ్రామానికి చెందిన దూడయ్య, కనకమ్మ దంపతులు తమకు సంతానం లేకపోవడంతో తన బావమరిది కుమారుడు సాంబరాజును దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న
యువకుడు..
రఘునాథపల్లి: జాతీయ రహదారిపై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి సమీపంలో హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న కారు గోవర్ధనగిరి దాటాక అదుపు తప్పి అతి వేగంతో డివైడర్ మీదుగా అవతలి వైపు రోడ్డులో జనగామ వైపునకు వెళ్తున్న వ్యాన్ను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన మహ్మద్ ముక్తేదార్, అతని కుమారుడు అహ్మద్ ఇత్తేదార్హుస్సేన్ (23) మరో ఆరుగురు స్నేహితులతో కలిసి ఈ నెల 16న వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన స్నేహితుడి కూతురు వివాహ వేడుకకు వ్యాన్లో హాజరై తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్కు చెందిన కల్వకుట్ల రాకేశ్రెడ్డి కారులో హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్నాడు. గోవర్ధనగిరి దాటాక కారు అదుపు తప్పి డివైడర్ మీ దుగా అవతలి రోడ్డులో జనగామ వైపునకు వెళ్తున్న వ్యాన్ను ఢీకొంది. దీంతో అహ్మద్ ఇత్తేదార్హుస్సేన్కు తీవ్ర గాయాలు కాగా, అతడి స్నేహితులు మహ్మద్ ఇస్సామ్, ఎం.డి ఇమాద్, ఎం.డి. ఆఫరాల్, అజ్రాన్, ఆర్కాం, ముబాసీర్కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇత్తేదార్హుస్సేన్ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాకేశ్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం. భరత్ తెలిపారు.


