రాష్ట్రస్థాయి అండర్‌–14 హ్యాండ్‌బాల్‌ రన్నరప్‌ వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అండర్‌–14 హ్యాండ్‌బాల్‌ రన్నరప్‌ వరంగల్‌

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

రాష్ట్రస్థాయి అండర్‌–14 హ్యాండ్‌బాల్‌ రన్నరప్‌ వరంగల్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో శనివారం ముగిసిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ 69వ రాష్ట్రస్థాయి అండర్‌–14 హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో బాలుర విభాగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు సత్తాచాటి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకోగా రన్నరప్‌గా వరంగల్‌ నిలిచింది. స్థానిక హీరా హోడల్‌ స్కూల్‌ మైదానంలో జరిగిన బాలుర ఫైనల్‌ ఉత్కంఠ పోరులో మహబూబ్‌నగర్‌ జట్టు 7–5 గోల్స్‌ తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది. అంతకుముందు బాలుర సెమీఫైనల్‌ మ్యాచుల్లో వరంగల్‌ జట్టు 5–2 గోల్స్‌ తేడాతో కరీంనగర్‌పై గెలుపొందింది. బాలికల విభాగం సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 6–3 గోల్స్‌ తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది. విజేతలకు ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి తదితరులు ట్రోఫీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement