తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

ఐనవోలు: కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దుద్దురాజు ఈ నెల 15 రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో కలిసి వేములవాడకు వెళ్లారు. దర్శనం ముగించుకుని శనివారం తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు రూ.1,01,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.70వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌ టీంతో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నగదు, ఆభరణాల అపహరణ

వనమాల కనపర్తిలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement