● రోటోవేటర్లో పడి బాలుడి మృతి
● పండుగ వేళ లెంకాలపల్లిలో విషాదం
నల్లబెల్లి: పండుగ వేళ ఆనందంగా గడపాల్సిన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.ప్రమాదవశాత్తు రోటోవేటర్లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై సాయి ప్రసన్న కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నానబోయిన కిరణ్, పావని దంపతుల కుమారుడు హేమంత్ (చెర్రీ) (04) శనివారం అదే గ్రామంలోని తన పెదనాన్న ఇంటికి వెళ్లాడు. తన అక్కలతో కలిసి ఇంటి ముందున్న రేకుల షెడ్డులో నిలిపి ఉంచిన ట్రాక్టర్ వద్ద ఆడుకుంటూ, దాని వెనుక భా గంలో అమర్చిన రోటోవేటర్పైకి ఎక్కాడు. ఈ క్ర మంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కదలడంతో బా లుడు రోటోవేటర్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కళ్లెదుటే ఆడుకుంటున్న చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. హేమంత్ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


