వెదురు బుట్టలతో రెడీమేడ్‌ బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

వెదురు బుట్టలతో రెడీమేడ్‌ బతుకమ్మ

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

వెదురు బుట్టలతో రెడీమేడ్‌ బతుకమ్మ – IIలోu

ఆ ఊరికే ప్రత్యేకం.. పెద్ద బతుకమ్మ

70 ఏళ్లుగా అతిపెద్ద బతుకమ్మ..

ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
బతుకమ్మ ప్రకృతికి ప్రతిరూపం. మానవాళి మనుగడకు కీలకాధారం. అందుకే ఆ ప్రకృతిని అమ్మవారి రూపంగా భావిస్తూ చెట్టుకు, పుట్టకు, పూలకు, నీళ్లకు అన్నింటికీ కృతజ్ఞత చూపుతారు. ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని బతుకమ్మ ఆడుతూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తీరొక్క పూలు సేకరిస్తూ.. పెద్ద బతుకమ్మలు పేర్చి ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లా ఆడపడుచులు. ఆప్రత్యేకతలే ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ.

జఫర్‌గఢ్‌: సద్దుల బతుకమ్మకు మండలంలోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన పోరెడ్డి సత్యనారాయణరెడ్డి కుటుంబం పెద్ద బతుకమ్మతో (5 ఫీట్లు) ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏళ్లుగా తన తండ్రి నర్సింహారెడ్డి నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సద్దుల పండుగకు వివిధ రకాల పూలను సేకరించి కుటుంబ సభ్యులంతా కలిసి అందంగా బతుకమ్మను పేరుస్తారు. సాయంత్రం సమయంలో ఇంటిల్లిపాది పెద్ద బతకమ్మను తీసుకుని డప్పుచప్పుళ్లు, డీజేతో ఊరేగింపుగా బతుకమ్మ ఆటస్థలానికి వెళ్తారు. గ్రామ మహిళలతో కలిసి సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. కొన్ని రకాల పూలు దొరక్కపోయినా కొనుగోలు చేసి మరీ పేరుస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఏటూరునాగారం: తాతముత్తాల నుంచి ఆనవాయితీగా ఎత్తయిన బతుకమ్మను పేరుస్తూ మండలంలోనే ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఏటూరునాగారం మండల కేంద్రంలోని నూతి కృష్ణ జ్యోతి. 70 ఏళ్లుగా ఐదు ఫీట్ల ఎత్తులో తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తున్నారు. వారం రోజుల నుంచే పూలు సేకరిస్తున్నారు. స్థానికంగా దొరకని పూలను వరంగల్‌ నుంచి తెప్పించి మరీ పెద్ద బతుకమ్మను పేరుస్తున్నారు. కాగా, సద్దుల బతుకమ్మ రోజు తమ ఇంట్లోని ముగ్గురు మహిళలు ఉదయం 8 గంటల నుంచి పేర్చడం ప్రారంభిస్తే సాయంత్రం వరకు సమయం పడుతుందని, ఈ సమయంలో అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడుతామని వారు చెబుతున్నారు. ఇన్నేళ్ల నుంచి గ్రామంలో ఇదే పెద్దదిగా పేరుగాంచింది.

● సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కుటుంబాలు

● ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement