కొనుగోళ్ల జోరు..
మానుకోట పట్టణంలో పూలు కొనుగోలు చేస్తున్న మహిళలు
ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్న మానుకోట రైల్వే స్టేషన్
నేడు సద్దుల బతుకమ్మ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళలు, యువతులు పూల సేకరణలో బిజీగా మారారు. వర్షాభావ పరిస్థితులతో తంగేడు, గునుగు వంటి అటవీపూలు ఈఏడాది తక్కువగానే లభిస్తున్నాయి. అయితే కొందరు కొద్దిపాటి పూలను సేకరించి పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. దీంతో పూల కొనుగోళ్లతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. మరోవైపు పండుగ సెలవులకు ఇళ్లకు చేరుకుంటున్న వారితో బస్స్టేషన్, రైల్వే స్టేషన్ ఫుల్ రద్దీగా మారాయి. ప్రజలు బస్సులు, రైళ్లలో కిక్కిరిసి ప్రయాణం సాగించిమరీ పండుగకు కుటుంబ సభ్యులతో గడపడానికి వస్తున్నారు. – మహబూబాబాద్ రూరల్


