నోటీసులను గడువులోపు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

నోటీసులను గడువులోపు పరిష్కరించాలి

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

సుదర్శన్‌రెడ్డి

మహబూబాబాద్‌: ఓటరు దరఖాస్తులు, నోటీసులను గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ తదితర విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్‌ ప్రక్రియ పురోగతి తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా తయారీ సంబంధించి అందిన ఫారం –18 దరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ స్నేహశబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

సమన్వయంతో చర్యలు చేపట్టాలి

వర్షాభావ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేక అధికారి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఆమె ఉమ్మడి వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, సాగు, తాగు నీరు, విద్యుత్‌ సరఫరా తదితర విషయాలపై సమీక్షించారు. సాగు, తాగు నీరు, విద్యుత్‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. వీసీలో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement