సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నారాయణపురం భూ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, సీసీఎల్ఏ, ఇతర ఉన్నతాధికారులు చేసిన ఆదేశాల మేరకు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. జిల్లాలో అనుభవం ఉన్న అధికారులకు పని అప్పగించి ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచాం. దీంతో ప్రతీ సెంటు భూముని సర్వే చేసి రైతులకు పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వగలిగాం. భూ భారతి చట్టం వచ్చిన తర్వాత రీ సర్వే పూర్తి చేసిన మొదటి గ్రామం నారాయణపురం. ఈ సర్వే విజయవంతం కావడం సంతృప్తినిచ్చింది.
–స్నేహ శబరీష్, కలెక్టర్


