మహబూబాబాద్ అర్బన్: నేడు జరగనున్న సద్దుల బతుకమ్మ కోసం జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు, ఎన్టీఆర్ స్టేడియంలో చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతిరమేష్ నాయక్ శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెరువులో బతుకమ్మ నిమజ్జనం చేసే దగ్గర పోలీసు, మున్సిపల్, రెవెన్యు అధికారుల పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. వీధి లైటు ఎక్కువ మొత్తంలో ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సి పల్ వైస్ చైర్మన్ సూర్ణపు సోమయ్య, వార్డు కౌన్సి లర్లు కాటా భాస్కర్, జనార్ధన్, రాజు, డీఈ ఉపేందర్, సీఐ రఘురాంరెడ్డి, ఎస్సై ఉమ పాల్గొన్నారు.


