మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో నూతన 2బీ బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపునకు శుక్రవారం కలెక్టరేట్లో లక్కీ డ్రా నిర్వహించారు. అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ లక్కీ డ్రా తీశారు. ఈమేరకు నర్సంపేటకు చెందిన కొలగాని ప్రమీల (టోకెన్ నంబర్ 305) లక్కీ డ్రా విజేతగా నిలిచారు. డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పోరిక కరంచంద్, మహబూబాబాద్, గూడూరు, తొర్రూరు ఎకై ్సజ్ సీఐలు రాంప్రసాద్, మమత, అశోక్, జిల్లా ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ సీఐ గురునాథ్, ఎకై ్సజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి ఈ నెల 28న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆరు ప్రొఫెసర్ పోస్టులు, 10 అసోసియేట్ ప్రొఫెసర్, 25 అసిస్టెంట్ ప్రొఫెసర్, 22 ట్యూటర్, ఒక అనస్థీషియా(ఐసీయూ), 2 జనరల్ మెడిసిన్, 2 పల్మనరీ మెడిసిన్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 28న ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జీఎంసీ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్హత, కులం, నివాస ధ్రువీకరణ పత్రంతో పాటు సంబఽంధిత పత్రాల జిరాక్స్ ప్రతులు వెంట తీసుకు రావాలన్నారు. మరిన్ని వివరాలకు జీఎంసీ మహబూబాబాద్.ఓఆర్జీ వెబ్సైట్లో పరిశీలించవచ్చని తెలిపారు.
ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమం వాయిదా
ములుగు: నేడు (శనివారం) ములుగు కలెక్టరేట్లో నిర్వహించనున్న ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమం వాయిదా పడినట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించే తేదీ, వివరాలను తదుపరి తెలియజేస్తామన్నారు. ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన ఆవిష్కర్తలు ఈ మార్పును గమనించాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూసెంటర్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్హెచ్ఎం పరిధిలో 67 కాంట్రాక్ట్, అవుట్సోర్సి ంగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ రవిరాథోడ్ శుక్రవారం తెలిపారు. ఫ్రిజ్మెకానిక్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 4, ఎంఎల్హెచ్పీ/సీహెచ్ఓ/ఎంఓ పల్లె దవాఖాన 34, ఆప్తాలమిక్ అసిస్టెంట్ 1, ఎంబీబీఎస్/ఎండీ ఫిజిషియన్2, ఫిజియోథెరపిస్టు/ఆక్యులేషన్ థెరపిస్టు 3, స్టాఫ్నర్సు 8, ఏఎన్ఎం 7, ఫార్మసిస్టు 2, సీనియర్ డాట్స్ప్లస్ టీబీ హెచ్ఐవీ సూపర్వైజర్ 2, పిడియాట్రిషన్ మెడికల్ ఆఫీసర్స్ 2, జిల్లా అకౌంట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు రుసుము (డీడీ) ఓసీ అభ్యర్థులు రూ. 500, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 300 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మహబూబాబాద్ పేరా డీడీ రూపంలో చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మహబూబాబాద్.తెలంగాణ. జీఓవీ.ఇన్ వెబ్సై ట్ను సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని డీఎంహెచ్ఓ తెలిపారు.


