మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్ ఫారం నిర్మించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు రైల్వే అధికారులను కోరారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ విస్తరణ, పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ ఫారం నిర్మాణం, లిఫ్ట్ ఏర్పాటు, ఇతర నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, కౌన్సిలర్ చిట్యాల జనార్దన్, పార్టీ నాయకులు మార్నేని రఘు, కొండపల్లి కరుణాకర్ రెడ్డి, వెన్నమల్ల అజయ్, అంబాల శివ తదితరులు పాల్గొన్నారు.


