ఎన్‌హెచ్‌ఎం సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

మహబూబాబాద్‌ అర్బన్‌/నెహ్రూసెంటర్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అందించి, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యదర్శి డోలి సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసనకు తెలంగాణ జనసమితి నాయకులు, తెలంగాణ మాలమహానాడు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు తమ ప్రాణాలకు లెక్క చేయకుండా వైద్యసేవలు అందించారన్నారు. ప్రభుత్వం వెంటనే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు వారికి తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌, నాయకులు ఖాజాపాషా, బాలు, శ్రీను ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement