సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

గూడూరు: విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని కేసముద్రం మండలం కాట్రపల్లి, భవానీతండాలకు చెందిన రైతులు గురువారం గూడూరు మండల పరిధి తీగలవేణి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేసముద్రం మండల బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులకు మద్దతు పలికారు. విద్యుత్‌ ఏడీ, ఏఈలు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న గూడూరు ఎస్సై సీహెచ్‌. రమేశ్‌బాబు వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకొని విషయం తెలుసుకున్నారు. విద్యుత్‌ ఏడీతో ఫోన్‌లో మాట్లాడి సమస్య వివరించారు. ఇకపై ఎలాంటి కోత లేకుండా సరఫరా అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనలో కేసముద్రం మాజీ జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, నాయకులు గుగూల్‌ వీరునాయక్‌, రవీందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement