హన్మకొండ కల్చరల్: బతుకమ్మ పండుగ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ పండుగను సంప్రదాయ, ఆచారాల ప్రకారం ప్రతీ సంవత్స రం నిర్వహించుకుంటున్నట్లుగానే తొమ్మిది రో జుల్లో చివరి రోజున 18న (ఆదివారం) సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని స్పష్టం చేశారు.
విద్యార్థినులపై
అసభ్యకర ప్రవర్తన
● పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
హన్మకొండ: విద్యాబుద్ధ్దులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకంగా ప్రవర్తించాడని తెలిసింది. ఈ విషయమై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు సంబంధిత స్కూల్‌కు చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. అలాగే, తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆ ఉపాధ్యాయుడి నిర్వాకం గురించి సహ ఉపాధ్యాయులను ప్రశ్నించినట్లు సమాచారం. హనుమకొండలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 4, 5 తరగతులకు చెందిన విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించి బ్యాడ్ టచ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం గురువారం సోషల్ మీడియాలో వైరలైంది. బ్యాడ్‌టచ్ చేసిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని తల్లిదండ్రులపై ప్రామీస్ చేయించినట్లు తెలి సింది. ప్రస్తుతం ఆ ప్రధానోపాధ్యాయుడు ఈ స్కూల్‌లో పని చేయడం లేదు. పాఠశాలల త నిఖీ బృందాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. బాలికల సంరక్షణ విభాగం సిబ్బంది పాఠశాలకు చేరుకుని జరిగిన ఘటనపై విద్యార్థినులను విచారించినట్లు తెలిసింది. కాగా, ఈ విషయం డీఈఓ గిరిరాజ్ గౌడ్ దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టనున్నారని సమాచారం.
ఎట్టకేలకు
కథ సుఖాంతం..
● బాధిత యువతి నాలుగు రోజుల
ఆందోళనకు తెర
● ఇరు కుటుంబాలు, స్నేహితుల మధ్య దండలు మార్చుకుని పెళ్లి
వర్ధన్నపేట: ప్రియుడు పెళ్లి చేసుకునేంత వరకు తాను కదిలేది లేదని ఇంటి ఎదుట పోరాటం చేస్తున్న ఆ యువతికి న్యాయం జరిగి కథ సుఖాంతం కావడంతో అందరూ సంతోషించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ తనను ప్రేమించి పెళ్లి వరకు వచ్చే సరికి మొఖం చాటేశాడని నాలుగు రోజులుగా వారి ఇంటి ఓ యువతి ఎదుట ఆందోళన చేసింది. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు చొరవతో ఇరు కుటుంబాలు, స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరిపిన అనంతరం బాధిత యువతి శ్రీదేవిని శ్రీకాంత్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్‌తో పాటు అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దీంతో దళిత సంఘాలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాంత్, శ్రీదేవి వివాహానికి సహకరించిన కుటుంబ సభ్యులకు కుల పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రొఫెసర్ నర్సింహారెడ్డికి ‘ఫార్మ రత్న’ పురస్కారం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫా ర్మసీ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ వై.నర్సింహారెడ్డి ఫార్మసీ రంగానికి చేసిన సేవలను గుర్తించినని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మరత్న పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు రెండురోజుల క్రితం న్యూ ఢిల్లీలోని ఫార్మ కౌన్సెల్ ఆఫ్‌ఇండియా కార్యాయలం నుంచి నర్సింహారెడ్డికి ఆహ్వానం అందింది. ఈనెల 27న న్యూఢిల్లీలో అధికారికంగా జరగనున్న కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. కాగా, నర్సింహారెడ్డి గత సెప్టెంబర్ 5న రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డును అందుకున్నారు.


