● వివరాలు వెల్లడించిన పోలీసులు
బయ్యారం: బాలికను వివాహం చేసుకున్న బాలుడితోపాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేసినట్లు గార్ల–బయ్యారం సీఐ లోడిగ రవీందర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన బాలుడు, బాలికకు చట్టవ్యతిరేకంగా వివాహం జరిపించారు. ఈ విషయంపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఫిర్యాదు మేరకు సీఐ రవీందర్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం బాలికను వివాహం చేసుకున్న బాలుడితోపాటు ఇందుకు సహకరించిన బాలుడి తల్లిదండ్రులను శుక్రవారం అరెస్ట్ చేసి మహబూబాబాద్ కోర్టులో హాజరుపర్చారు. వీరిలో బాలుడిని వరంగల్‌లోని జువైనల్ హోమ్‌కు, తల్లిదండ్రులను మహబూబాబాద్ జైలుకు తరలించారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
● కొలన్‌పల్లిలో ఘటన
రాయపర్తి: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లా రా యపర్తి మండలం కొలన్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాజుల సురేశ్, దివ్య (26) దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. సురేశ్ గ్రా మంలో ఆర్‌ఎంపీగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో దంపతులు మధ్య శుక్రవారం గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో దివ్య.. భర్త బయటకు వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలు సుకున్న దివ్య తల్లిదండ్రులు, బంధువులు కొ లన్‌పల్లికి చేరుకుని తమ కుమార్తెను భర్త సురేశ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరో పిస్తూ ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచా రం అందుకున్న వర్ధన్నపేట సీఐ సంజీవరావు, రాయపర్తి, పాలకుర్తి, జఫర్‌గఢ్, వర్ధన్నపేట మండలాల ఎస్సైలు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. న్యా యం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


