● రోహిర్ గ్రామంలో ఘటన
ఏటూరునాగారం : అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీసు స్టేషన్ పరిధిలోని రోహిర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీనారాయణ కుమార్తె స్వర్ణలత (25) 2025లో అదే గ్రామానికి చెందిన సొదారి హరీశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం స్వర్ణలత నాలుగు నెలల గర్భిణి. ఈ క్రమంలో కొన్ని రోజులుగా అదనపు కట్నం, భూమి కోసం భర్త హరీశ్, అత్తామామలు వజ్రమ్మ, లింగయ్య వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఈ వేధింపులు భరించలేక స్వర్ణలత ఈ నెల 2వ తేదీన గుర్తుతెలియని పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే ఏటూరునాగారంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.


