మెరుగైన వసతుల కల్పనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వసతుల కల్పనకు కృషి

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని రైల్వే అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. రైల్వే స్టేషన్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా సుమారు రూ.26 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బుకింగ్‌ కార్యాలయం, స్టేషన్‌ ప్రాంగణం, ఇతర నిర్మాణ పనులు పరిశీలించి నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు అందించిన వినతి పత్రాలను స్వీకరించారు. డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఆంజనేయులురెడ్డి, సీనియర్‌ డీఈఎన్‌ కో ఆర్డినేషన్‌ వరుణ్‌ బాబు, డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ దినకరన్‌ ప్రణీత్‌, సీనియర్‌ డీఈఎన్‌ యాదగిరి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహ న్‌ కుమార్‌, వివిధ శాఖలకు చెందిన రైల్వే ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

● దక్షిణ మధ్య

రైల్వే జీఎం

సంజయ్‌

కుమార్‌ శ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement