వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–14,17 బాలబాలికల జూడో ఎంపిక పోటీలు శుక్రవారం వరంగల్‌లోని కెమిస్ట్ భవన్‌లో నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి 120 మంది హాజరు కాగా ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు కెమిస్ట్ భవన్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఎస్‌జీఎఫ్ హనుమకొండ జిల్లా నిర్వహణ కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీల సంఘం బాధ్యుడు ప్రభాకర్ రెడ్డి, జూడో అసోసియేషన్ బాధ్యుడు కై లాస్‌యాదవ్ , ఎస్‌జీఎఫ్ వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల అనిల్ కుమార్, గుగులోత్ కిషన్, డాక్టర్ రాము, ప్రేమ్‌ప్రసాద రావు, జూడో కోచ్‌లు నాగరాజు, సురేశ్, కుమార్, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.


