● రాష్ట్ర వైద్యశాఖ సంచాలకుడు
రవీంద్రనాయక్
చిన్నగూడూరు: ప్రతీ సెంటర్‌లో 12 రకాల వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర వైద్యశాఖ సంచాలకుడు రవీంద్రనాయక్ సిబ్బందికి సూచించారు. మండలంలోని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, ల్యాబోరేటరీ సేవలు, అందుబాటులో ఉన్న మందులనిల్వలు, వ్యా క్సినేషన్, రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్వయంగా అడి గి తెలుసుకున్నారు. గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల ప్రోత్సాహం, ప్రజలకు అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రమీలదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ నాగేశ్వరరావు, డీఐఓ శివకుమార్, అర్జున్, విరాజిత, డీపీఓ నిలోహన, స్థానిక వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


