తెలుగులో తడబాటు | - | Sakshi
Sakshi News home page

తెలుగులో తడబాటు

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సాక్షి, మహబూబాబాద్‌ : ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధించాలని ప్రభుత్వం పదేపదే సూచిస్తోంది. ఇందుకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఇంత చేసినా.. ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రైవేట్‌కు దీటుగా బోధన పక్కన పెడితే కనీస సామర్థ్యాలు సాధించడంలో కూడా విద్యార్థులు వెనకబడి ఉన్నారు. మాతృభాష తెలుగు చదవడం, రాయడంలో కూడా తడబడు తున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా జూలై రెండో వారంలో నిర్వహించిన బేస్‌లైన్‌(పునాది) పరీక్షల ద్వారా ఈ చేదు నిజాలు బయటపడ్డాయి.

జూలైలో పునాది పరీక్ష..

విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఆ విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలను రూపొందిస్తారు. ఇందులో భాగంగా జూలై రెండో వారంలో జిల్లాలోని 177 కాంపిటెంట్‌ పాఠశాలలు, 510 సాధారణ పాఠశాలలు మొత్తం 687 పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే 20,899 మంది విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా లాంగ్వేజ్‌(భాష), గణితంలో పరీక్షలు నిర్వహించారు. భాషా విభాగాల్లో(త్రీ ఆర్‌) అక్షరాలు రాయడం, చదవడం, వ్యాఖ్యలు రాయడం, ధారాళపఠనం మొదలైన నైపుణ్యాలు, గణితంలో అంకెలు రాయడం, గుర్తించడం, పోల్చడం, కూడికలు, తీసివేతలు, గుణకార, భాగాహారాల్లో విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు.

తెలుగు, ఇంగ్లిష్‌లో పదిశాతం లోపే..

తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడంలో 10శాతంలోపు విద్యార్థులు కనీస సామర్థ్యాలు కలిగి ఉండడం గమనార్హం. మాతృభాష తెలుగులో ఐదో తరగతి చదివే విద్యార్థుల్లో కాంపిటెంట్‌ పాఠశాలల్లో 8.6శాతం, ఇతర పాఠశాలల్లో 6శాతం మాత్రమే చదవడం, రాయడం తెలిసిన వారు ఉండడం గమనార్హం. ఇక ఒకటి నుంచి నాల్గోతరగతి వరకు చదివే విద్యార్థుల్లో కనీసం ఓనమాలు, అక్షరాలు, గుణింతాలు, ఏబీసీడీలు కూడా తెలియని వారు ఉండడం శోచనీయం.

గణితంలో అంతంతే..

మాతృభాష తెలుగు, ఆంగ్లంతోపాటు, గణితంలో కూడా విద్యార్థుల ప్రగతి అంతంత మాత్రంగానే ఉన్నట్లు బేస్‌లైన్‌ పరీక్షల్లో తేలింది. ప్రధానంగా అంకెలు రాయడం, సంఖ్యలను గుర్తించడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు చేయడంలో నూటికి ఎనబైశాతం మంది విద్యార్థులు వెనకబడి ఉన్నారు. గణితంలో కాంపిటెంట్‌ పాఠశాలలతో పోలిస్తే సాధారణ పాఠశాలల్లో చదివే విద్యార్థులే కాస్త మెరుగ్గా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఐదో తరగతి చదివే వారిలో కాంపిటెంట్‌ స్కూల్స్‌లో 16.4శాతం, ఇతర పాఠశాలల్లో చదివే వారు 18శాతం మంది మాత్రమే కనీస ఉత్తీర్ణత పొందారు.

ప్రగతి సాధించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ

బేస్‌లైన్‌ పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యా సంవత్సరంలో బోధన మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. ఇందుకోసం మండల విద్యాశాఖ అధికారులతోపాటు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించాం. కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు చేపట్టే కార్యక్రమాలు వివరిస్తాం. పాఠశాల పర్యవేక్షణ పెంచుతాం.

–మందుల శ్రీరాములు, ఇన్‌చార్జ్‌ డీఈఓ

ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కరువు

తెలుగు చదవడం, రాయడంలో వెనకడుగు..

పునాది పరీక్షల్లో తేలిన నిజాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement