ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

డీఏఓ విజయచంద్ర

మరిపెడ రూరల్‌: రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పకుండా చేసుకోవాలని డీఏఓ విజయచంద్ర సూచించారు. మరిపెడ మండలంలోని ధారావత్‌తండా, గిరిపురం, మరిపెడ తదితర గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో చేపడుతున్న ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకునేలా రైతులందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవడం ద్వారా ఎరువుల బుకింగ్‌లో ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వ్యవసాయ సేవలను పొందేందుకు రిజిస్ట్రేషన్‌ అవసరమని డీఏఓ తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బోడ వీరాసింగ్‌, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలి

గూడూరు: ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు, రైతులకు విద్యుత్‌ సరఫరా చేయాలని ఎస్‌ఈ దర్శన్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంతో పాటు అయోధ్యపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌ స్టేషన్‌లలో కలిగే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా వెంటనే మరమ్మతు చేయాలని, వేసవి కార్యాచరణ ప్రణాళిక, ఆదాయ వసూళ్ల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈలు కుమారస్వామి, శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కేజీబీవీల్లో టెర్మినేషన్‌

విధానాన్ని రద్దు చేయాలి

కురవి: కేజీబీవీల్లో టెర్మినేషన్‌ విధానాన్ని రద్దు చేయాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీల్లో టెర్మినేషన్‌ చేసిన ఎస్‌ఓలను తిరిగి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో చదవుకునే విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని తెలిపారు. కేజీబీవీల్లో పనిచేసే ఎస్‌ఓలతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, పాఠశాలల పని విధానాన్ని వివరించి పని విధానాలను ప్రక్షాళన చేయాలన్నారు. సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులు అందించాలన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు గుండ్ల విజయ్‌కుమార్‌, ఓదెల శివకుమార్‌, బొల్లం శ్రీనివాస్‌, గుగులోత్‌ వెంకన్న, బాలరాజు పాల్గొన్నారు.

రేపు వయోవృద్ధులకు ప్రత్యేక కార్యక్రమం

మహబూబాబాద్‌: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్‌ 1న కలెక్టరేట్‌లో ఉదయం 11.30 గంటలకు వయోవృద్ధులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ శిరీష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వయోవృద్ధులు, సీనియర్‌ సిటిజన్లు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వయోవృద్ధుల సంక్షేమం, హక్కులు, ఆరోగ్యం, సామాజిక భద్రత, జీవనం వంటి అంశాలపై అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలో 2–బీ బార్‌ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ పి.కరంచంద్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్‌ 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ, 16న లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. బార్‌కు వర్తించే వార్షిక బార్‌ ఎకై ్సజ్‌ పన్ను స్లాబ్‌ రూ.30లక్షలుగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement