మహబూబాబాద్: బాధితులకు అండగా నిలవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖి (వన్ స్టాప్) సెంటర్‌ను మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మహిళలు సఖి కేంద్రానికి రాగానే తక్షణమే స్పందించి వారికి అవసరమైన వైద్యం, న్యాయ, పోలీస్ సాయం అందించాలన్నారు. హింసకు గురైన మహిళలు తీవ్రమైన ఆందోళనలో ఉంటారని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మానసిక స్థైర్యం కల్పించాలన్నారు. చట్టపరమైన హక్కులపై బాధితులకు అవగాహన కల్పించడంతో పాటు ఉచిత న్యాయం అందేలా డీఎల్‌ఎస్‌ఏతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, ఉష, స్వాతి, లావణ్య, శోభ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


