టెర్మినల్‌ సహా కీలక నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

టెర్మినల్‌ సహా కీలక నిర్మాణాలు

Sep 29 2026 1:15 AM | Updated on Sep 29 2026 1:15 AM

ఎయిర్‌పోర్ట్‌ పనుల్లో మరో అడుగు

ఖిలా వరంగల్‌ : మామునూరు ఎయిర్‌పోర్ట్‌ పనుల్లో మరో అడుగు పడింది. ఇప్పటికే రూ.203.49 కోట్ల అంచనా వ్యయంతో రన్‌వే ఆధునికీకరణ, ట్యాక్సీ వేలు, విమానాల పార్కింగ్‌ ఆప్రాన్‌, టర్మినల్‌కు అనుసంధాన రోడ్లు, గ్రౌండ్‌ సపోర్ట్‌, పలు మౌలిక వసతుల పనులకు టెండర్లు పిలిచిన ఎయిర్‌ఫోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) .. తాజాగా మరో రూ.213.59 కోట్లతో నూతన డొమెస్టిక్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌, ఏటీసీ టవర్‌ కమ్‌ టెక్నికల్‌ బ్లాక్‌, ఎలక్ట్రికల్‌ సబ్‌ స్టేషన్‌, ఫైర్‌ స్టేషన్‌, ఈ అండ్‌ ఎం వర్క్‌షాప్‌ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఈ మొత్తం పనులను 18 నెలల వ్యవధిలో పూర్తి చేసేలా ఏఏఐ గడువు నిర్దేశించింది. దీంతో మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు మరో కీలక దశలోకి చేరాయి.

నవంబర్‌ 3 వరకు బిడ్ల దాఖలు

ఈ ప్యాకేజీకి ఆక్టోబర్‌ 6 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేయడానికి ఆవకాశం కల్పించారు. నవంబర్‌ 9న టెక్నికల్‌ బిడ్లను, అదే నెల 30న ఫైనాన్షియల్‌ బిడ్లను తెరవనున్నట్లు ఏఏఐ అఽ ధికారులు తెలిపారు. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికై న సంస్థకు పనులు అప్పగించి, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయనున్నారు.

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ సందర్శన

మామునూరు విమానాశ్రయాన్ని సోమవారం టెండర్‌దారులతో కలిసి ఏఏఐ ఆధికారులు సందర్శించారు. పాత రన్‌వేతోపాటు ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన ప్రీ– బిడ్‌ సమావేశంలో రూ.213.59 కోట్ల ప్యాకేజీలో చేపట్టనున్న నిర్మాణాలు, సాంకేతిక అంశాలు, టెండర్‌ నిబంధనలపై టెండర్‌ దారులకు అధికారులు వివరించారు. టెండర్‌దారుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏఐ ఏజీఎం నాగరాజ్‌, తహసీల్దార్‌ ఇక్బాల్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాజాగా రూ.213.59 కోట్లతో

టెండర్ల ఆహ్వానం

అక్టోబర్‌ 6 నుంచి నవంబర్‌ 3వరకు

బిడ్ల దాఖలుకు అవకాశం

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన ఏఏఐ అధికారులు, టెండర్‌దారులు

హరిత హోటల్‌లో ప్రీ–బిడ్‌ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement