దయగల గోడ.. | - | Sakshi
Sakshi News home page

దయగల గోడ..

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

తొర్రూరు: అది పేదల అవసరాలు తీర్చుతున్న దయగల గోడ. ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు అందిస్తోంది. ఈ గోడ పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని లయన్స్‌క్లబ్‌ భవనం వద్ద ఉంది. సాధారణంగా ఉద్యోగులు, సంపన్న వర్గాల వారు ఇళ్లలో పాత వస్తువులు, సైజు తేడా ఉన్న దుస్తులు తదితరాలను పడవేస్తుంటారు. తొర్రూరు వాసులు మాత్రం అలాంటి వాటిని ‘దయగల గోడ’ వద్ద ఉంచుతున్నారు. వాటిని పేదలు ఉచితంగా తీసుకెళ్తున్నారు. తాజాగా లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు క్లబ్‌ భవనం పక్కన దీనిని ఏర్పాటు చేశారు. ‘ మీకు అవసరమైనవి తీసుకుని వెళ్లండి, మీకు వినియోగం లేనివి ఇక్కడ ఉంచండి’ అని అవగాహన కల్పించే విధంగా రాశారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోంది. దినసరి కూలీలు, కార్మికులు, ఎలాంటి భరోసా లేని వారికి ఈ గోడ కల్పతరువుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement