తెలంగాణ వచ్చిన సంతోషమే లేదు | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ వచ్చిన సంతోషమే లేదు

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

● తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్‌ గుడిమళ్ల రవికుమార్‌

హన్మకొండ చౌరస్తా: స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసినా, మలిదశ, తొలిదశ ఉద్యమకారుల్లో తెలంగాణ వచ్చిన సంతోషం కొంచెం కూడా కనిపించడం లేదని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్‌, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ కాకతీయ కాలనీలోని ఐక్యవేదిక కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడారు. ఈనెల 17న ఉద్యమకారుల ఓదార్పు యాత్రను ప్రారంభించామన్నారు. ప్రతిరోజు 25 మంది ఉద్యమకారుల కుటుంబాల కలిసి వారి స్థితిగతులను తెలుసుకుంటున్నామని వివరించా రు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, అస్తిత్వం కోసమే యాత్ర చేస్తున్నామని, ఏ పార్టీకి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఓదార్పు యాత్ర ముగిసేసరికి ప్రతి ఉద్యమకారుడికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement