వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

పూల కోసం వెళ్లి బావిలో పడి బాలుడు..

ఖానాపురం: వినాయకుడి పూజకు పూలు కోసేందుకు వెళ్లిన 17 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన ఖానాపురం మండలం చిలుకమ్మతండాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకమ్మ తండాకు చెందిన బానోత్‌ రమేశ్‌–సరిత దంపతుల కుమారుడు విజయ్‌(17) కూలి పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఆదివారం తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం వినాయకుడికి పూలమాల వేసేందుకు పూలు కోసుకురావడానికి స్నేహితుడితో కలిసి తండా శివారులోని ఓ రైతు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి ఒడ్డున ఉన్న పూల చెట్టు నుంచి పూలు కోస్తుండగా విజయ్‌ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బావిలో పడిపోయాడు. ఇది గమనించిన స్నేహితుడు వెంటనే తండా వాసులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని విజయ్‌ను బావిలో నుంచి బయటకు తీసే సరికి అప్పటికే అతడు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విజయ్‌ తండ్రి రమేశ్‌ గతంలోనే మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు విజయ్‌ చనిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో చిలుకమ్మతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి తల్లి సరిత, ఒక సోదరి ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై రామ్మోహన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇంట్లో జారిపడి వ్యక్తి ..

లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్లలో ఆదివారం గొరిగె శ్రీశైలం (51) ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తలకు గాయాలై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శ్రీశైలానికి ఇటీవల కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంట్లోనే ఉంటున్నాడు. శనివారం రాత్రి బాత్‌రూమ్‌కు వెళ్తూ ఇంట్లో జారిపడ్డాడు. కుటుంబ సభ్యులు లేచి చూడగా తలకు గాయాలై ఉండడంతో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో వారి రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ..

కాజీపేట: కాజీపేట పట్టణం బాపూజీనగర్‌ చౌరస్తా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై శివ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ప్రధాన రహదారి పక్కన సదరు వ్యక్తి మృతి చెంది ఉండగా గుర్తించిన ఎలక్ట్రానిక్‌ రిపేర్‌ షాపు యజమాని కొలువుల లక్ష్మయ్య చూసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని సందర్శించి పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయస్సు 60ఏళ్లకు పైబడి ఉంటుందని, తెల్లని అంగీ, తెల్లని పంచె, తెల్లని గడ్డం కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురీకి తరలించి భద్రపర్చినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికై నా తెలిస్తే 87125–52333 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఆయన కోరారు.

చికిత్స పొందుతూ వృద్ధుడు..

ఖిలా వరంగల్‌: ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందినట్లు వరంగల్‌ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌కుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్‌ చింతల్‌ ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో ఈనెల 8న ఉదయం 11.30 గంటలకు ఎలియా (60)ను గూడ్స్‌ రైలు ఢీకొంది. దీంతో ఆతడు తీవ్ర గాయాలతో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీలో భద్రపర్చినట్లు, సమాచారం కోసం 9440361941, 8712658627 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌కుమార్‌ తెలిపారు.

తలసేమియాతో బాలుడు..

గణపురం: తలసేమియా వ్యాధి తో బాధపడుతూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారంకు చెందిన ఇండ్ల రజిత,సది దంపతుల కుమారుడు సతీశ్‌కుమార్‌(5) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ౖగ్రామానికి చెందిన రజిత, సది దంపతులకు కవల పిల్లలు సతీశ్‌కుమార్‌, శ్యాంకుమార్‌ ఉన్నారు. ఇద్దరూ తలసేమియాతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో సతీశ్‌కుమార్‌కు వైద్యం మెరుగైన చేయించలేకపోయాడు. దీంతో శనివారం మృతిచెందాడు. శ్యాంకుమార్‌ కూడా తలసేమియాతోనే బాధపడుతున్నాడని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆదివారం వేర్వే రు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఖానాపురంలో పూలకోసం వెళ్లి బావిలో పడి బాలుడు, జనగామ జిల్లా లింగాలఘ ణపురంలో ఇంట్లో జారి పడి ఒకరు, కాజీ పేట బాపూజీనగర్‌లో అనుమానాస్పద స్థితిలో మరొకరు, వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఇంకొకరు, భూపాలపల్లి జిల్లా గణపురంలో బాలుడు మృతి చెందా రు. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement