ప్రైవేట్‌ టీచర్లకు సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ టీచర్లకు సంక్షేమ పథకాలు

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

విద్యారణ్యపురి: రాష్ట్రంలో ప్రైవేట్‌ టీచర్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేస్తోందని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆల్‌ ప్రైవేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీపీటీఏ) బాధ్యులు హనుమకొండలోని ఓ కన్వెన్షన్‌హాల్‌లో ఉత్తమ ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ప్రైవేట్‌ ఉపాధ్యాయుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. డాక్టర్‌ కూరపాటి రమేశ్‌, డాక్టర్‌ రాధిక మాట్లాడుతూ ఇప్పటికే తమ ఆస్పత్రి నుంచి ప్రైవేట్‌ టీచర్లకు ఉచిత హెల్త్‌కార్డులు ఇచ్చామన్నారు. టీపీటీఏ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు చందర్‌లాల్‌నాయక్‌చౌహాన్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ ఉపాధ్యాయులను కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజున సన్మానించాలని కోరారు. అనంతరం తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ప్రైవేట్‌ ఉపాధ్యాయులను సన్మానించారు. హనుమకొండ ఎంఈఓ నెహ్రూ, కాజీపేట ఎంఈఓ బి.మనోజ్‌కుమార్‌, సామాజికవేత్త చిలువేరు శంకర్‌, ఏపీ ప్రైవేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొదండరామిరెడ్డి, జనరల్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌, కన్వీనర్‌ కేటీ నాయుడు, టీపీటీఏ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు చందుప్రకాశ్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఆ డెపు చంద్రమోహన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల ముకుందం, బాధ్యులు మెడి ప్రభాకర్‌, మహిళా అ ధ్యక్షురాలు రాపర్తి సుజాత, కార్యదర్శి ఆస్మబేగం, జిల్లా ఉపాధ్యక్షులు టి.సంపత్‌, రహీంఖాన్‌, అనిశెట్టి నరేశ్‌, మురళి, డోలి రాజు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement