మరిపెడ రూరల్ : షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి గృహోపకరణాలు, నగదు, విలువైన పత్రాలు కాలిపోయాయి. ఈ ఘటన మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడతండాలో ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, బాధితుడి కథనం ప్రకారం.. తండాకు చెందిన బోడ బాలు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య కుమార్తెకు అనారోగ్యంతో ఉండడంతో మరో ఊరికి వెళ్లింది. ఈ క్రమంలో బాలు శనివారం ఆటో తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు బాలుకు సమాచారం అందించారు. వెంటనే ఇంటికి చేరుకున్న బాలు తలుపులు తీసి పరిశీలించగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి గృహోపకరణాలు దగ్ధమైనట్లు గుర్తించాడు. ఈ ప్రమాదంలో సమారు రూ.50 వేల నగదు, టీవీ, ఇతర విలువైన పత్రాలు కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన తన కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని బాలు కోరారు. సమాచారం అందుకున్న మరిపెడ అదనపు ఎస్సై మెహబూబ్‌బి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
రూ.50వేల నగదు, టీవీ, విలువైన పత్రాలు దగ్ధం
బోడతండాలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం


