విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించాలి

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థులు ఇష్టంగా చది వి లక్ష్యాన్ని ఛేదించాలని తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ రియాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో శనివారం ప్రిన్సిపాల్‌ పొక్కుల సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో రియాజ్‌ మాట్లాడారు. విద్యార్థులు, యువకులు సెల్‌ ఫోన్‌ మత్తులో పడి విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని అన్నారు. లక్ష్యసాధనలో ఒకసారి అపజయం పొందినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రణాళికతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని తెలిపారు. అనంతరం డీఐఈఓ మధార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రిన్సిపాల్‌ సదానందం మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ బాలికల కళాశాల ఉత్తమ ఫలితాలు సాధిస్తుందన్నారు. తమ కళాశాలలో ఎంసెట్‌ కోచింగ్‌, ఉచిత యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్‌, షూస్‌ అందిస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బోడ రవినాయక్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ వీవీ నాగేందర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ చొప్పరి శ్రీనివాస్‌, అధ్యాపకులు సాధిక్‌అలీ, పర్వీన్‌బేగం, రవికిరణ్‌, స్వరూప, సృజన, పూర్ణిమ, భార్గవి, కిరణ్‌, రవి, భాగ్యలక్ష్మి, ఉమ, అక్షర, ప్రభాకర్‌, వెంకన్న, మహమ్మద్‌ బాషాజాని పాల్గొన్నారు.

తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ రియాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement