గోమయ గణపతి | - | Sakshi
Sakshi News home page

గోమయ గణపతి

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

శ్రీమహాలక్ష్మి గణపతి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లా కేంద్రంలోని శ్రీమహాలక్ష్మి గణపతి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఆవు పేడ, గడ్డితో రూపొందించిన గోమయ గణపతి విగ్రహాన్ని తొమ్మిదేళ్లుగా ప్రతిష్ఠిస్తున్నారు. ట్రస్టు సభ్యులు శ్రీరంగం రాధిక, ఎస్‌వీ నాగేశ్వర్‌రావు, శ్రీరంగం రాజేశ్వరి, రామారావు, సోమ రజిత, శ్రీనివాస్‌, సోమ సింధు, రాంబాబు తదితరులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ సామాజిక చైతన్యం కలిగిస్తున్నారు. ఇందులో భాగంగా 2008 నుంచి 2016 వరకు మట్టి గణపతి విగ్రహాలు, 2017 నుంచి గోమయ వినాయకుడి విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా..

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మట్టి గణపతి విగ్రహాల కంటే గోమయ గణపతి విగ్రహాలను పూజించడం భక్తులకు ఎంతో శుభసూచకం. అందుకే గోమయ గణపతిని ఏర్పాటు చేసి పూజిస్తున్నాం. భవిష్యత్‌ తరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించాలనేది మా ధ్యేయం.

– ఎస్‌వీ నాగేశ్వర్‌రావు, శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్టు సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement