మహిళపై దాడిచేసిన ఎంపీడీఓను సస్పెండ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళపై దాడిచేసిన ఎంపీడీఓను సస్పెండ్‌ చేయాలి

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

కురవి : మహిళపై వాటర్‌ బాటిల్‌ విసిరిన ఎంపీడీఓను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరుతూ సీరోలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీఎస్పీ, టీఆర్‌పీ నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఎంపీడీఓపై సీరోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కాంత్‌, టీఆర్‌పీ నాయకుడు అనిల్‌ మాట్లాడారు. నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం సీరోలు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి అడిగిన బాధిత మహిళ బాలెం వెంకటమ్మపై వాటర్‌బాటిల్‌ విసిరి గాయపరిచిన ఎంపీడీఓ గౌస్‌ను సస్పెండ్‌ చేయాలన్నారు. ఇంటి పన్ను చెల్లించి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం సీరోలు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన సమయంలో బాటిల్‌తో వెంకటమ్మపై దాడి చేయడం దారుణమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి ఎంపీడీఓను సస్పెండ్‌ చేయాలన్నారు. వెంకటమ్మకు వైద్యం చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నవీన్‌కుమార్‌, బొట్ల వినోద్‌, ఆర్‌టీఐ నాయకులు పాల్గొన్నారు.

బీఎస్పీ, టీఆర్పీ నాయకుల డిమాండ్‌

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement