విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

ఆదివారంపేటలో ఘటన

గూడూరు: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు ఆదివారంపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూనావత్‌ వాల్యానాయక్‌ (60) తన ఇంటి వద్ద సంపుపై అమర్చిన విద్యుత్‌ మోటారు పై ఉన్న తాడు తీస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి పెద్ద కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సెకండ్‌ ఎస్సై యాదవరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement