● కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఆరుగురు సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పిస్తూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, వారికి పోస్టింగ్ ఉత్తర్వులు కూ డా వీసీ కె. ప్రతాప్‌రెడ్డితో కలిసి అందజేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు పొందిన కె. భూపాల్‌రెడ్డి పరీక్షల విభాగం, ఎం. సునీల్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎం. భాస్కర్ క్యాంపస్‌లోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల, బి. ప్రభాకర్ కేయూ హాస్టల్ ఆఫీస్, కె. శ్రీనివాస్ పబ్లికేషన్ సెల్, జి. సురేశ్‌బాబుకు అకౌంట్స్ విభాగంలో పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు అందజేశారు.
ఇద్దరికి లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ –1గా పదోన్నతి
కాకతీయ యూనివర్సిటీలో లైబ్రరీ అసెస్టెంట్ గ్రేడ్ –2గా పనిచేస్తున్న ఇద్దరికి అసిస్టెంట్ గ్రేడ్ –1గా పదోన్నతులు కల్పి స్తూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ‘లా’ కాలేజీలో లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్–2గా పనిచేస్తున్న సుమలతకు, యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కళాశాలలో లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ –2గా పనిచేస్తున్న అశోక్‌కు లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ –1గా పదోన్నతి కల్పించారు.అలాగే వారిద్దరికి కాకతీయ యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీలో పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు.
నలుగురు సీనియర్ అసిస్టెంట్‌లకు..
కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నలుగురు సీనియర్ అసిస్టెంట్‌లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అందులో ముగ్గురికి సీనియర్ కోటా కింద, మరొకరికి టెస్ట్ కోటాలో పదోన్నతి కల్పించారు. హనుమకొండలోని సుబేదారి యూనివర్సిటీ పీజీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ బోథ్‌రాజుకు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ క్యాంపస్‌లోని హాస్టల్ ఆఫీస్‌లో పోస్టింగ్ ఇచ్చారు. వీసీ పేషీలో సీనియర్ అసిస్టెంట్ సి. రవికి సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. అకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ వినయ్‌కు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించి దూరవిద్య కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చారు. కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలోని సీనియర్ అసిస్టెంట్ మదార్‌అలీకి సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించిఅదే ఇంజనీరింగ్ కళాశాలలో పోస్టింగ్ ఇచ్చారు. వీరికి వీసీ ప్రతాప్‌రెడ్డి ,రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు అందజేశారు.
49మంది పార్ట్‌టైం లెక్చరర్ల నియామకం
కాకతీయ యూనివర్సిటీలో 2026–2027విద్యాసంవత్సరానికి వివిధ విభాగాలు, ‘లా’ కళాశాలకు 49మంది పార్ట్‌టైం లెక్చరర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి రిజిస్ట్రార్ వి.రామచంద్రం జాబితా వెల్లడించి నోటీస్ బోర్డుపై ప్రదర్శించారు. కొన్నినెలల క్రితం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సెలక్షన్ కమిటీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారు. కెమిస్ట్రీ విభాగంలో 9మంది, కంప్యూటర్ సైన్స్ విభాగం ఏడుగురు, కామర్స్‌అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ విభాగం 14మంది, ఇంగ్లిష్ విభాగం ఇద్దరు, జియాలజీ ఒకరు, యూనివర్సిటీ ‘లా’ కాలేజీలో నలుగురు, లైబ్రరీ సైన్స్‌విభాగంలో ఒకరు, ఫిజిక్స్‌లో ఐదుగురు, పొలిటికల్ సైన్స్‌లో ఒకరు, సైకాలజీ ఇద్దరు, సొషియాలజీ ఒకరు, తెలుగులో ఒకరు, జువాలజీలో ఒకరిని ఎంపిక చేశారు. వీరికి ఈనెలాఖరులోపు ఆయా విభాగాల అధిపతులు ఉత్తర్వులు ఇవ్వాల్సింటుంది.


