దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు అవసరం | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు అవసరం

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

కేయూ క్యాంపస్‌: భారతదేశ అభివృద్ధికి మరిన్ని నూతన ఆవిష్కరణలు అవసరమని, అందుకనుగుణంగా జిజ్ఞాస పెంపొందించుకోవాలని హైదరాబాద్‌లోని సెయింట్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌, పద్మశ్రీ బి.వి మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్‌హాల్‌లో విద్యార్థుల, వివిధ విభాగాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ప్రతీ ఏడాది సుమారు కోటిమంది ఉద్యోగ మార్కెట్‌లో ప్రవేశిస్తున్నారన్నారు. దేశానికి ఉన్న డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ గొప్ప అవకాశమన్నారు. జనాభాలో సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉండడం దేశానికి బలమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యంత వేగంగా మారుతుందోన్నారు. దీనివలన ఇప్పటికి ఉన్న వ్యాపార నమూనాలు, ఉద్యోగాల స్వరూపం కూడా మారిపోతోందన్నారు. చాట్‌బాట్‌లు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతిక సాధనాలను ముప్పుగా కాకుండా ఉత్పాదతకంగా వినియోగించుకోవాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, ఓఎస్‌డీ బి. వెంకట్రాంరెడ్డి, రూసా నోడల్‌ అధికారి ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ సెయింట్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌

పద్మశ్రీ డాక్టర్‌ బి.వి మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement