కాశిబుగ్గ: లర్నర్స్ ల్యాండ్ స్కూల్, తాళ్ల పద్మావ తి విద్యాసంస్థల అధినేత తాళ్ల మల్లేశం శని వారం రాత్రి (73) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ చార్‌బౌళిలోని లర్నర్స్‌ల్యాండ్ కాలనీలో కన్నుమూశారు. ఆయన మృతికి పలు పాఠశాలల కరస్పాండెంట్లు, కాలనీ వాసులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనకు భార్య ఝాన్సీ, కుమారులు వంశీ, తరుణ్ ఉన్నారు.
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
నయీంనగర్ : కుటుంబ కలహాలతో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమకొండ దీన్‌దయాల్ నగర్‌లో కానిస్టేబుల్ బి.అనిల్ భార్య శిరీష (36) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ బి. అనిల్ హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఫింగర్ ప్రింట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన శిరీష మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, శిరీషకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.


