తొర్రూరు రూరల్: మాజీ మావోయిస్టు నేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న 36 ఏళ్ల తర్వాత మానుకోట జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలోని తన అక్క, బావ ఇంటికి శుక్రవారం వచ్చారు. దీంతో అక్కబావలైన కోమాళ్ల సౌమ్యదామోదార్‌రావుతోపాటు గ్రామ పెద్దలు ఆశన్నకు స్వాగతం పలికారు. తన చిన్నతనంలో వచ్చిన ఆశన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో పని చేసి అనేక ఏళ్ల తర్వాత జన జీవన స్రవంతిలోకి వచ్చారు. అక్క, బావలు అప్యాయత, ప్రేమతో ఆశన్నను ఆలింగనం చేసుకుని ఆనందంగా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బందు శ్రీనివాస్, నాయకులు కోమాళ్ల లింగారావు, కందాడి అచ్చిరెడ్డి, కొమ్ము యాకయ్య, బందు జంపన్న, గుంశావలి, గణేష్ పాల్గొన్నారు.


