నకిలీ కాస్మొటిక్స్‌తో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

నకిలీ కాస్మొటిక్స్‌తో జాగ్రత్త

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

పట్టణంలో డ్రగ్స్‌ కంట్రోల్‌

ఆధ్వర్యంలో తనిఖీలు

జనగామ: జనగామ పట్టణంలోని సూపర్‌ మార్కెట్లు, బ్యూటీ పార్లర్లు, ఫ్యాన్సీ స్టోర్లు, కాస్మటిక్స్‌ విక్రయ కేంద్రాల్లో డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. జనగామ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. తనిఖీల సందర్భంగా వివిధ రకాల కాస్మొటిక్‌ ఉత్పత్తుల లేబుల్స్‌ , నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యతా నిర్ధారణ కోసం పలు ఉత్పత్తుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ సందర్భంగా అధి కారులు మాట్లాడుతూ.. కాస్మొటిక్‌ ఉత్పత్తులు కొనుగోలు చేసే సందర్భంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, దిగుమతి చేసిన (ఇంపోర్టెడ్‌) ఉత్పత్తులు కొనుగోలు చేసే సమయంలో వాటిపై దిగుమతిదారు వివరాలు, అవసరమైన రిజిస్ట్రేషన్‌, అనుమతుల వివరాలను పరిశీలించాలని తెలిపా రు. కాస్మొటిక్స్‌ వాడిన తర్వాత చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, మంట లేదా ఇతర ప్రతికూ ల ప్రభావాలు కనిపిస్తే వినియోగాన్ని నిలిపివేసి వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement