‘దేవీశరన్నవరాత్రి’ ఉత్సవాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

‘దేవీశరన్నవరాత్రి’ ఉత్సవాలకు వేళాయె

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

● నేటినుంచి అమ్మవారికి పూజలు

● వేదికలు సిద్ధం చేసిన భక్తులు

మహబూబాబాద్‌ రూరల్‌: అమ్మలగన్న అమ్మ, జగన్మాత శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా వేడుకల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో మండపాలు, వేదికలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11నుంచి 20వ తేదీ వరకు 10రోజులపాటు దుర్గాదేవి అమ్మవారికి పూజలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు. 21వ తేదీన అమ్మవార్ల నిమజ్జనం జరగనుంది. పలు ప్రాంతాల్లో విష్ణు సహస్ర, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు పటించనుండగా సాంస్కృతిక కార్యక్రమాలు ఛండీ, రుద్ర హోమాలు, అన్నదాన కార్యక్రమాలు, కుంకుమ పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, మానుకోట పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి 25వ శరన్నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు చౌడవరపు సుందర్‌గుప్తా, నిర్వాహకులు చౌడవరపు మోహన్‌ రావు తెలిపారు. అలాగే మహేశ్వరి భవన్‌లో మార్వాడీ సమాజ్‌, సఖీ మండలి, మార్వాడీ యువమంచ్‌ ఆధ్వర్యంలో 31వ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ బాధ్యుడు ఎస్‌ఎస్‌లోయ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement