నేటి నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 11నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయని ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీరాములు శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ బాలుర పాఠశాలలో మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు, నలుగురు డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, 10 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తిస్తారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, వైద్యారోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొని సమయానికి పరీక్షలకు హాజరుకావాలన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

కురవి: మండలంలోని నేరడ మోడల్‌ స్కూల్‌కు చెందిన బాలికలు రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ వై.శ్రీకాంత్‌, పీడీ ఐనాల సురేష్‌ శనివారం తెలిపారు. ఈనెల 11, 12వ తేదీల్లో నిజామాబాద్‌లోని తొర్లికొండలో జరిగే పోటీల్లో ఎస్‌కె తన్వీరా, జి.లాస్య, బి.సాత్విక, సయ్యద్‌ మొన పాల్గొంటారని వివరించారు. అలాగే పాఠశాల–కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 13వరకు ఆసిఫాబాద్‌లో జరిగే పోటీల్లో ఎస్‌కె తబస్సుం, డి.రమ్య పాల్గొంటారని తెలిపారు.

డోర్నకల్‌లో..

డోర్నకల్‌: స్థానిక సెయింట్‌ ఆగ్నేస్‌ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థులు బి.శ్రవణ్‌, బి.లికిత్‌కుమార్‌ ప్రతిభ కనబర్చి ఆసిఫాబాద్‌లో ఆదివారం నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ స్టేట్‌ మీట్‌కు ఎంపికయ్యారు. పాఠశాల కరస్పాండెంట్‌ ఆంటోని పసాల, ప్రిన్సిపాల్‌ హెలెన్‌రాణి అభినందించారు.

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నెహ్రూసెంటర్‌: విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8.30గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ సంగీత శనివారం తెలిపారు. పాత బజారులో విద్యుత్‌ అంతరాయనికి వినియోగదారులు సహకరించాలని కోరారు.

సమాజ సేవపై బాధ్యతగా వ్యవహరించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థులు, యువత సమాజ సేవపై బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పొక్కుల సదానందం అన్నారు. మానుకోట మున్సిపల్‌ పరిధిలోని ఈదులపూసపల్లి ఎంపీపీఎస్‌లో బాలికల జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే సేవా దృక్పథం అలవర్చుకోవాలన్నారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రోగ్రాం అధికారి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతీ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, అప్పుడే దేశ యువత దేశాభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం ఉంటుందన్నారు. హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, గట్ల శ్రీపాల్‌రెడ్డి, వినేయ్‌, గోవర్ధన్‌, అధ్యాపకులు సురేందర్‌, శ్రీను, సృజన పాల్గొన్నారు.

రామప్పలో అభిషేక పూజల సమయం పొడిగింపు

వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో రేపటి నుంచి రామలింగేశ్వరస్వామి అభిషేక పూజలను ఉదయం 11 గంటల వరకు పొడగిస్తున్నట్లు ఆలయ ఈఓ భాస్కర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలోని సోమసూత్రం (నీరు వెళ్లే మార్గం) మూసుకపోయినందున గతంలో ఉదయం 7గంటల వరకే అభిషేకం చేసేవారని తెలిపారు. ఇటీవల పురావస్తుశాఖ అధికారులు సోమసూత్రాన్ని పునరుద్ధరించడంతో ఉన్నతాధికారుల అనుమతితో ఉదయం 6 నుంచి 11గంటల వరకు అభిషేక పూజలను అర్చకులు నిర్వహిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement