న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
వైభవంగా
కిటకిటలాడిన దేవాలయాలు ఆటపాటలతో మహిళల సందడి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో బతుకమ్మ సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం ఎంగిలిపూల బతుకమ్మకు వేడుకలను మహిళలు, యువతులు ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లలో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పేర్చి గౌరమ్మను కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. భక్తులు బతుకమ్మలతో ఆలయాలకు చేరుకొని ఒకచోట కొలువుదీర్చి ఒక్కేసి పువ్వేసి చందమామ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడి సందడి చేశారు. పలుచోట్ల డీజే పాటలకు యువతులు నృత్యాలు చేశారు. చివరగా వాయినాలు ఇచ్చిపుచ్చుకుని భక్తులు తమ ఇళ్లకు వెళ్లారు. ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో టౌన్ సీఐ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో షీటీం, పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు.


