● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
● మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
మహబూబాబాద్: బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో నూతన జిల్లాల ఏర్పాటుతో మారుమూల మానుకోట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లాలు ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారని, మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాలని ఎదురుచూస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఉన్న వ్యత్యాసం ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్. రెడ్యానాయక్, శంకర్‌నాయక్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బిందు, నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఫరీద్, భరత్‌కుమార్‌రెడ్డి, అశోక్, శ్రీను, రఘు పాల్గొన్నారు.


