కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాజీపేట, వరంగల్, ఖమ్మం మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నెల 26వ తేదీన తిరుపతి–చర్లపల్లి, 27న చర్లపల్లి–తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం తెలిపారు. తిరుపతి–చర్లపల్లి (07417) వెళ్లే ఎక్స్‌ప్రెస్ 26వ తేదీన రాత్రి 8గంటలకు తిరుపతిలో బయల్దేరి కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు(27వ తేదీ) 07:15 గంటలకు చేరుతుంది. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన చర్లపల్లి–తిరుపతి (07418) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు 18:30 గంటలకు చేరుకుని 28వ తేదీన ఉదయం 8గంటలకు తిరుపతికి చేరుతుంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రెండు రైళ్లకు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట జంక్షన్‌లో అప్ అండ్ డౌన్ మార్గంలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు.
యాదగిరి గుట్ట థర్మల్
ప్రైవేటీకరణ సరికాదు
హన్మకొండ: యాదగిరి గుట్ట థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకో వాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సల్వాజి వెంకటరమణారావు డిమాండ్ చేశారు. యాదగిరి గుట్ట థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో గత 35 రోజులుగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరి గుట్ట థర్మల్ పవర్ స్టేషన్‌లో కోల్ హ్యాండలింగ్ ప్లాంట్, యాష్ హ్యాండలింగ్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఉద్యోగుల సంఘాలన్నీ ఏకమైనప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు సబ్సిడీలు ఉండవని, కరెంట్ చార్జీలు పెరుగుతాయని, ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం.దిలీప్, టి.కిరణ్, శ్రీకాంత్, పి.శ్రీనివాస్, సౌజన్య, ఉద్యోగులు పాల్గొన్నారు.
● టీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ వెంకటరమణారావు
● టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన
కార్యాలయం ఎదుట ధర్నా


