నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

పాలకుర్తి టౌన్‌: వారిద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు.. చిన్ననాటి నుంచి కలిపిమెలిసి ఉన్నారు. ఈక్రమంలో ఓ స్నేహితుడి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోండగా.. భోజనం ఇచ్చేందుకు ఇద్దరూ హెల్మెట్‌ ధరించకుండానే బైక్‌పై వెళ్లి వస్తున్నారు. ఈక్రమంలో మరమ్మతుకు గురికావడంతో నిర్లక్ష్యంగా రోడ్డుపైనే నిలిపిన బోర్‌వెల్‌ వాహనాన్ని ఢీ కొన్ని ఇద్దరు మిత్రులు ప్రాణాలొదిలారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం నర్సింగపురం తండా గ్రామానికి చెందిన బాదావత్‌ తిరుపతి(34) తల్లి సుగుణమ్మకు జ్వరం రావడంతో పాలకుర్తిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దీంతో సుగుణమ్మకు భోజనం ఇచ్చేందుకు స్నేహితుడు కేతావత్‌ నరేందర్‌(27)తో కలిసి తిరుపతి బైక్‌పై ఆస్పత్రికి వెళ్లారు. భోజనం అందించిన అనంతరం తిరిగి గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై (హెల్మెట్‌ లేకుండానే) ఇంటికి బయల్దేరారు. ఈక్రమంలో బమ్మెర, రాఘవపురం గ్రామాల మధ్య మరమ్మతు రావడంతో రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన బోరుబండిని ఢీ కొట్టారు. దీంతో తీవ్ర గాయాలతో కేతవాత్‌ నరేందర్‌ అక్కడిక్కడే మృతి చెందగా.. ప్రాణాపాయ స్థితిలో తిరుపతి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రరారం తెల్లవారు జామున మృతి చెందాడు. తిరుపతి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు. తిరుపతికి భార్య మంజుల, కూతురు, కుమారుడు ఉన్నారు. నరేందర్‌ అవివాహితుడు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య పరిశీలించారు.

మరమ్మతు కారణంగా బోర్‌వెల్‌ వాహనాన్ని రోడ్డుపైనే నిలిపిన డ్రైవర్‌

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన

నిర్లక్ష్యంగా రోడ్డుపక్కన నిలిపి యువకుల మృతికి కారణమయ్యారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట శుక్రవారం గిరిజన గిరిజన సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేస్తూండగా కొంత మంది యువకులు పోలీస్‌స్టేషన్‌ ఎస్సై చాంబర్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు పోలీసు సేష్టన్‌లో ఉద్రిక్తత నెలకొంది. సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్‌ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బోరు బండి యాజమానులను పిలించి వారితో చర్చలు జరిపారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు.

ఆస్పత్రికి వెళ్లొస్తూ బోర్‌వెల్‌ను

ఢీ కొట్టిన యువకులు

హెల్మెట్‌ ధరించకపోవడంతో

ఇరువురూ మృత్యువాత

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట

బాధిత కుటుంబాల ఆందోళన

స్నేహితుల మృతితో గ్రామంలో

విషాదఛాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement