వ్యవసాయ, అనుబంధ | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ, అనుబంధ

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

రంగాలపై దృష్టి సారించాలి

డాక్టర్‌ ఎం.కిషన్‌కుమార్‌

మామునూరు: ఎల్‌నినో పరిస్థితుల్లో వ్యవసాయ, అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాని పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ ఎం.కిషన్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్‌ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఎల్‌నినో పరిస్థితుల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రత్యామ్నాయ చర్యలపై కిసాన్‌ మేళా, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథులు మాట్లాడారు. కేవీకే చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులను వివరించారు. రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఐసీఏఆర్‌, ఎస్‌సీఎస్‌పీ, టీఎస్పీ పథకం కింద 66 మంది లబ్ధిదారులకు కేటాయించిన యూనిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌వీకే అధిపతి డాక్టర్‌ నర్సయ్య, కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.అరుణ్‌జ్యోతి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్‌, డాక్టర్‌ సౌమ్య, డాక్టర్‌ రాజు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement