ప్రశస్త్‌.. ప్రయోజనాలు మస్త్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశస్త్‌.. ప్రయోజనాలు మస్త్‌

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

రెండు దశల్లో సమగ్ర స్క్రీనింగ్‌.. మొదటి దశ (ఉపాధ్యాయుల పరిశీలన) రెండో దశ (స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పరిశీలన) ధ్రువీకరణ పత్రాలు సులభం

కాళోజీ సెంటర్‌: పాఠశాల విద్యార్థుల్లోని వైకల్యాలను ముందస్తుగా గుర్తించి, వారికి అవసరమైన ప్రభుత్వ సాయం, విద్యావనరులను అందించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన శ్రీప్రశస్త్‌శ్రీ మొబైల్‌ అప్లికేషన్‌ వారధిలా ఉపయోగపడనుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌, గురుకుల, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లతో సహా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. రైట్స్‌ ఆఫ్‌ పర్సనన్స్‌ విత్‌ డిజబిలిటీస్‌ (ఆర్‌పీడబ్ల్యూడీ) చట్టం–2016 ప్రకారం గుర్తించిన 21 రకాల వైకల్యాలను స్క్రీనింగ్‌ చేసేందుకు ఉపాధ్యాయులకు ఈయాప్‌ ఎంతో దోహదపడనుంది.

ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రశస్త్‌ యాప్‌లో పలు కొత్త మార్పులను తీసుకొచ్చారు. స్క్రీనింగ్‌ ప్రక్రియను రెండు ప్రధాన దశల్లో పూర్తి చేసేలా రూపొందించారు.

ప్రతి ఉపాధ్యాయుడు ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌనన్‌్‌ లోడ్‌ చేసుకోవాలి. పాఠశాల శ్రీయూడీఐఎస్‌ఈశ్రీ కోడ్‌, నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌ (ఓటీపీ) ద్వారా లాగిన్‌ అవ్వాలి. లాగిన్‌ అయిన వెంటనే వివిధ వైకల్యాలపై అవగాహన కల్పించే 10 వీడియోలు కనిపిస్తాయి. ప్రతి ఉపాధ్యాయుడు ఈ వీడియోలను తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా తరగతి గదిలోని విద్యార్థుల మానసిక, శారీరక వైకల్యాలను సులభంగా గుర్తిస్తారు.

మొదటి దశలో ఉపాధ్యాయులు గుర్తించిన విద్యార్థులను స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పునఃపరిశీలిస్తారు. ఒకవేళ మొదటి స్క్రీనింగ్‌లో ఉపాధ్యాయులు వైకల్యాన్ని తప్పుగా గుర్తిస్తే.. రెండో దశలో స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ దానిని సరిచేస్తారు. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రెండో స్క్రీనింగ్‌ పూర్తిచేసిన తర్వాతే ఆ పాఠశాల శ్రీప్రశస్త్‌శ్రీ స్క్రీనింగ్‌ ప్రక్రియ పూర్తయినట్లు భావిస్తారు. సమగ్ర డిజిటల్‌ చెక్‌ లిస్ట్‌లోని 21 రకాల వైకల్యాలను ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా సులభంగా అసెస్‌ చేయవచ్చు.

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను (సీడబ్ల్యూఎస్‌ఎన్‌) పాఠశాల స్థాయిలోనే గుర్తిస్తే వారికి తగిన బోధనా వనరులను సమయానుకూలంగా అందించవచ్చు. స్క్రీనింగ్‌ అనంతరం యాప్‌ ద్వారా జనరేట్‌ అయ్యే శ్రీపాఠశాల స్థాయి నివేదికశ్రీలను సంబంధిత అధికారులకు సమర్పించాలి. అనంతరం విద్యార్థులు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందే ప్రక్రియ వేగవంతమవుతుంది.

వైకల్యాలు గుర్తించేందుకు ఉపయోగపడనున్న యాప్‌

పాఠశాలస్థాయిలోనే విద్యార్థులకు డిజిటల్‌ స్క్రీనింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement