సూపరింటెండెంట్‌ పోస్టులు భర్తీచేయాలి | - | Sakshi
Sakshi News home page

సూపరింటెండెంట్‌ పోస్టులు భర్తీచేయాలి

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

వరంగల్‌ అర్బన్‌: బల్దియాలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయాలని జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 సూపరింటెండెంట్‌ పోస్టులు గత మూడేళ్లుగా ఖాళీ గా ఉంటున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు బొట్ల రమేష్‌, వర్కింగ్‌ అధ్యక్షుడు రాజారపు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి బాకం సంతోష్‌కుమార్‌, కోశాధికారి సర్జన్‌ రాజు, ప్రతినిధులు ఇజ్రాయిల్‌, విజయ్‌ ఉన్నారు.

ట్రైసిటీలోని సమస్యలు పరిష్కరించాలి

ట్రైసిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ వెంకన్నను కలిసి వినతిపత్రం సమర్పించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి తేరాల యుగంధర్‌, ఉపాధ్యక్షుడు నాగులగాం నర్సయ్య, హనుమకొండ సీడబ్ల్యూసీ మెంబర్‌ కజాంపురం దామోదర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement