పంచబిల్వాలకు సంప్రోక్షణ నిర్వహిస్తున్న అర్చకుడు
పంచబిల్వాలతో అభిషేకం నిర్వహిస్తున్న అర్చకుడు
హన్మకొండ కల్చరల్: వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని నిత్యాగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తులసి, బిల్వ, నిర్గుండి, జంబిరా, అమల్ల పంచబిల్వాలతో అర్చన చేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.


